ఆగమము : కృష్ణా జిల్లా, నందిగామ టౌన్ మరియు మండలము నందు వేంచేసియున్న శ్రీ సుఖ శ్యామలాంబ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము ప్రాచినమైనది. దేవాలయము 4 మూలలు శ్రీ రామేశ్వర, శ్రీ సోమేశ్వర, శ్రీ భీమేశ్వర, శ్రీ చంద్రమౌలేశ్వర స్వామివారి ఉపాలయములతో అత్యంత శోభాయమానంగా విరాజిల్లుచున్నది.
శ్రీ స్వామి వారు స్వయంభు వెలిసినారు గా వాడుక కలదు. యి ప్రాంతము జమిందారు అయిన శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారు తన జమి గ్రామమైన నందిగామ లో యి దేవాలయము ఉన్నoదున తమ ఆధీనములోనికి తీసుకోని, ఉన్నతమైన గోపురములను, ప్రాకారములను నిర్మాణము గావించి శ్రీ స్వామివారి యందు తనకు గల భక్తిని నిరుపించుకొని నందిగామ గ్రామము తాలుకు సుమారు 1100 యకరములు భూమి దేవాలయమునకు సమర్పించిరి.
ప్రతి సంవత్సరం శ్రావణ ఆశ్వియుజ కార్తీక మాఘ మాసములు నందు విశేష పూజలు, ఉత్సవములు జరుపబడుచున్నవి. మాఘశుద్ధ దశమి నుండి శ్రీ స్వామివారి కళ్యాణ మహోస్తావములు 10 రోజుల పాటు జరుగును. యి ఉత్సవములలోకళ్యాణము, రదోత్స్వము, పవళింపు సేవలు అత్యంత శోభాయమానంగా నిర్వహించబడును. యి సందర్భంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో శ్రీ స్వామివారిని దర్శించి తరించెదరు.
ప్రతి నెల మాసశివరాత్రికి శ్రీ స్వామివారికి బిల్వార్చన, మరియు ప్రతి పౌర్ణమి రోజు శ్రీ శుక శ్యామలాంబ అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుచున్నవి. దేవాలయం నందు నవగ్రహ విగ్రహ ప్రతిష్ట చాల కాలము క్రితము జరుపగా, శని త్రయోదశి నాడు భక్తులు విరివిగా పాల్గోని నవగ్రహ పూజలు చేయిన్చుకోనుచున్నారు. శ్రీ సుఖ శ్యామలాంబ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారు భక్తులపాలిట కల్పవృక్షంబు వలె దేవాలయము నందు విరాజిల్లుచున్నది